రాజానగరం మండలం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం సిగరెట్ కారణంగానే జరిగిందని అటవీ డిప్యూటీ రేంజ్ అధికారిణి పద్మా వతి బుధవారం తెలిపారు. హైవే పై ఎవరో వెళుతూ సిగరెట్ కాల్చి విసిరేయడంతో అప్పటికే ఎండిపోయిన ఆకులు, ఎండిన పుల్ల ముక్కలు అంటుకుని మంటలు వ్యాపించాయన్నారు. సిబ్బంది సత్వర చర్యలతో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. పెద్ద చెట్లకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.