తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయం ఎదుట కూటమి నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెదేపా నేత మనోజ్ రెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలతో కలిసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బోర్డు తొలగించి, ప్రతుల దహనం చేశారు.