రాజానగరం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం మండలంలోని పెదకొండేపూడి, చీపురపల్లి, మిర్తిపాడు, కోటి గ్రామాల్లో మంగళవారం మామిడి తోటలు జనాలతో కిటకిటలాడాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కోడిపందేల్లో, గుండాటల్లో పాల్గొంటున్నారు. నిన్న ఓ మోస్తరుగా జనం వచ్చిన మంగళవారం అధిక సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో లక్షల రూపాయలు చేతులు మారాయి అనే ఆరోపణలు ఉన్నాయి.