పని చేసే ప్రదేశంలో చక్కటి వాతావరణం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం రాజానగరంలోని దివాన్ చెరువు - 2 సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించే బాధ్యత ఉద్యోగస్తులుగా మనపై ఉందని, అందు కోసం జవాబుదారీతనం కలిగిన విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.