రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చె నాయుడుని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 2024 వరదల్లో నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని కోరారు. నియోజకవర్గంలో రైతులకు పండించిన పంటలు నిలువ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ లు నిర్మాణానికి సహకరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతుల సమస్యలను మంత్రికి వివరించారు.