గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మంగళవారం రాజానగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంటనే చంద్రబాబు ప్రకటించిన పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామని గుర్తు చేశారు.