రాజానగరం: అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం

74చూసినవారు
రాజనగరం మండలం కొండగుంటూరులో అక్రమంగా తరలిస్తున్న 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ ఎస్పీ శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఒడిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి టాటా ప్యూర్ వాహనంలో గంజాయిని తరలిస్తున్నారన్నారు. సమాచారం తెలుసుకుని దాడి చెయ్యగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ వీరయ్య గౌడ్, ఎస్ఐలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్