రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతున్న కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. స్వామివారి తీర్థ మహోత్సవాల్లో భాగంగా చేసిన ఈ అలంకరణతో ఆలయ పరిసరాలు కూడా వెలుగులు విరాజిల్లుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు శుక్రవారం వరకు జరుగుతాయి. కొండపై వెలసిన స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.