అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను అందించడం జరుగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ మండలంలోని నీడిగట్ల గ్రామంలో మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసిన జనవరి నెల పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ పాల్గొన్నారు.