రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో ఆదివారం నూతన శివాలయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని పూజలు చేశారు. శివాలయం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. అలాగే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.