రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చాము కానీ సొంత స్వలాభం కోసం తాము రాజకీయాల్లోకి రాలేదని రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఆమె బుధవారం తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో జక్కంపూడి రాజా పై పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.