రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాలెండర్ 2025ను వీసీ ఆచార్య వై. శ్రీనివాసరావు బుధవారం ఆవిష్కరించారు. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వీసీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాలు, అనుబంధ కళాశాలల సిబ్బంది విద్యార్థులు అంతా నూతన లక్ష్యాలను ఎంచుకొని ముందుకు వెళ్లాలన్నారు.