రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ ను గురువారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా కోరుకొండ, శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ తొందరగా అనుమతులు, నిధులు మంజూరు చేస్తామన్నారు.