రాజానగరం నన్నయ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎం. ఏ, ఎం. కామ్, ఎంఎస్సీ కోర్సుల్లో భర్తీ చేయని సీట్లకు 29న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని వీసీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఏపీ పీజీసెట్ రాయకపోయినా, రాసి అర్హత సాధించకపోయినా స్పాట్ అడ్మిషన్‌లో పీజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత శాతం ఓసీ, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీలకు 45% సాధించిన వారు అర్హులన్నారు.