రాజానగరం నియోజకవర్గంలో కొత్తగా 469 స్పౌజ్ పెన్షన్ మంజూరయ్యాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం అన్నారు. రాజానగరం మండలంలో 170, కోరుకొండ మండలంలో 156, సీతానగరం మండలంలో 143 మందికి స్పౌజ్ పెన్షన్లు జూన్ 12 న అందించనున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులతో కలిసి లబ్దిదారులకు స్పౌజ్ పెన్షన్ పంపిణి జరుగుతుందని తెలిపారు.