14 ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో ఈ మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనిచేయిస్తున్నారని సమాచారం అందిస్తే. వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.