రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తూ. గో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందాలు కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశారు. అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.