సీతానగరం మండలం వెదుళ్ళపల్లిలోని శ్రీ బొల్లి మున్నియ్య మెమోరియల్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులను బుధవారం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో డొక్కా సీతమ్మ మద్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.