కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో నూతన డ్రైనేజీ నిర్మిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బoదులు ఎదుర్కోవడంతో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు నూతన డ్రైనేజీ నిర్మాణo ఆదివారం చేపట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్లు , డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.