తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ పార్టీ నిర్వహించినట్లు తెలిసి, వీరంతా పురుగు మందు షాపుల యాజమాన్యానికి సంబంధించిన వారుగా గుర్తించారు.