వరద బాధితులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. సీతానగరం మండలం కూనవరం గ్రామంలోని గోదావరి ముంపు ప్రాంతాలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు, బియ్యం, నిత్యవసర సరకుల సరఫరా గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద ముంపునకు గురైన పంటలను పరిశీలించారు.