పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం సమావేశం ద్రాక్షారామంలోని గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్దు మాట్లాడుతూ జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని విద్యా వ్యవస్థలో సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.