రామచంద్రపురం నియోజవర్గం వెల్ల గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వార్ల పునః నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని నూతన ధ్వజస్తంభపూర్వక నందీశ్వర, నవగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాసశెట్టి సత్యం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు.