రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం తన వ్యక్తిగత నిధులు వెచ్చించి పేదలకు రూ. 5, 30, 000 ఆర్థిక సహాయం అందజేశారు. కె. గంగవరం మండలం సత్యవాడ లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరుపేదలకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల పక్షాన నిలబడి ఆర్థిక సహాయం చేసిన సుభాష్ ను పలువురు నేతలు, స్థానికులు అభినందించారు.