రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం పల్లెపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో అందించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.