డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ఏరుపల్లి గ్రామంలో గోశాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి, పంట పుష్కలంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, తద్వారా ప్రజలంతా సుఖసంతోషాలతో హాయిగా జీవిస్తారన్నారు. గో సంరక్షణ మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.