కోటిపల్లి గోదావరిలో వ్యక్తి గల్లంతు

59చూసినవారు
కోటిపల్లి గోదావరిలో వ్యక్తి గల్లంతు
కే. గంగవరం మండలం కోటిపల్లి స్నానఘట్టంవద్ద రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం మోటార్ సైకిల్ పై వచ్చి స్నానానికి దిగారు. వారిలో కందుల నరేంద్ర(26) గల్లంతయ్యాడు. కంచిమూర్తి అంజి నదిలో కొట్టుకుపోతూ చేతులు పైకెత్తి అరవడంతో స్నానఘట్టంవద్ద ఉన్న యువకులు వెళ్లి ఒడ్డుకు తీసుకురాగా అంజి ప్రాణాపాయంనుండి బయటపడ్డాడు. పామర్రు పోలీసులు నరేంద్రకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్