ఇల్లు లేని నిరుపేదలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2. 0 స్కీము ద్వారా ఇంటిని నిర్మించుకునేందుకు డిసెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం లో శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు పూరి పాకలో గాని, పెంకుటిల్లు లేదా అద్దె ఇంట్లో ఉంటూ సొంత స్థలం కలిగి ఉన్నవారు, ఇంటి పునాదులు, బేస్మెంట్లు మొదలుపెట్టి పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులన్నారు