ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు అనుమోలు దేవా స్వామివారికి లక్ష రూపాయలు విలువచేసే 8 కూలర్స్ చండీ హోమం పండితులు జుత్తిక చిన్నా ప్రోత్సాహంతో సోమవారం బహుకరించారు. హైదరాబాద్ వాస్తవ్యులు తంగిరాల రవి కిరణ్ నాగలక్ష్మి శైలజ దంపతులు శ్రీ స్వామివారికి 328 గ్రాముల తూకం గల వెండి శంఖం కానుకగా అందజేసారు. దాతలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వారు అల్లు దుర్గ భవాని అభినందించారు.