సంపూర్ణ అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సామూహిక అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 9 అంచెల విధానంతో ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఉపాధ్యాయుడును నియమించే పద్ధతుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతుందన్నారు.