ద్రాక్షారామంలోని నున్నవారి వీధిలో ఏకలవ్యుని జన్మదిన వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం హాజరయ్యారు. తొలుత ఏకలవ్యుని, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వాసంశెట్టి సత్యం గారు మాట్లాడుతూ గురువును దైవంగా భావించే ఏకలవ్యుడును నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.