రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో జరిగిన ఒక సంఘటనపై ద్రాక్షారామ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదును విచారించకుండా ఫిర్యాదు దారులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వాటిపై విచారణ జరపించి నిజా నిజాలు తేల్చాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు డిఎస్పీ కార్యాలయంలో ఆదివారం డిఎస్పీ రఘువీర్‌నుఎంపీ బోస్, సూర్యప్రకాశ్ తో కలిసి వివరాలను అందజేశారు.