తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా నోటి దురుసుతనం తగ్గించుకోవాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా హెచ్చరించారు. రామచంద్రపురంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తిరుమల దేవస్థానం మాజీ చైర్మన్ భూమన చౌకబారు రాజకీయాలు చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి అంటూ మంత్రి సుభాష్ హితవు పలికారు.