రామచంద్రాపురంలో 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమంలో వైసీపీ కోనసీమ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి శనివారం పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.