యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని, అందుకు అవసరమైన ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. రామచంద్రపురంలో సోమవారం విజయ్ ఫంక్షన్ హాల్ లో కోనసీమ స్టార్టప్ సమ్మిట్ పేరుతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.