అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి సోమవారం వివిధ సేవల ద్వారా రూ. 3, 02, 511 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. వేకువజాము నుంచి స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొందని, భక్తుల దర్శనాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లుగా ఈవో తెలియజేశారు.