గత సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మంత్రి సుభాష్ అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ కె. గంగవరం మండలం వట్రపూడి గ్రామ ప్రజలు అమ్మవారికి మొక్కుకున్నారు. ఎన్నికల్లో మంత్రి సుభాష్ అనూహ్య రీతిలో అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు రాష్ట్ర క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో శనివారం వట్రపూడి గ్రామంలోని వెలగాలమ్మ తల్లి సమక్షంలో తమ మొక్కును చెల్లించుకున్నారు.