ఏజెన్సీ ప్రాంత గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాభ్యాసాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తెలిపారు. శనివారం మారేడుమిల్లి తాడేపల్లి, బూసుగూడెం ఆశ్రమ పాఠశాలలను ఆయన సందర్శించారు. బేస్ లైన్ టెస్ట్‌లు, నాణ్యమైన విద్య, ప్రభుత్వ మెనూ అమలు పై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.