బెల్టు షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ హెచ్చరించారు. శనివారం దేవీపట్నం నుంచి ఆయన మాట్లాడుతూ. పెద్దభీంపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపుపై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఇక్కడ బెల్టు షాపు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే చర్యలు చేపట్టమన్నారు. ఈ దాడుల్లో విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేసామన్నారు.