పోలవరం రిజర్వార్ నిర్మాణంలో దేవీపట్నం మండలంలోని కొండమొదలు పంచాయతీ పరిధి గ్రామాలు ముంపునకు గురైందని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని నిర్వాసితులు దేవిపట్నం తాహాసిల్దార్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ. భూములిచ్చిన రైతులకు నష్టపరిహారాన్ని ఒకే పద్ధతిలో మంజూరు చేయకుండా అన్యాయం చేశారన్నారు. నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.