ఎటపాక: రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి

83చూసినవారు
ఎటపాక: రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి
బైక్ ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. కుక్కునూరు మండలంలోని నెమలిపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. అల్లూరి జిల్లా ఎటపాక మండలంలోని చింతలగూడెంకి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై ఏలేరుపాడుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలైన వీరిని అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా రాజుల శ్రీనివాస్ మృతి చెందాడు. దీనితో చింతలగూడెంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్