పాములేరు వాగులో గల్లంతైన రవితేజ మృతదేహం లభ్యమైందని సీఐ గోపాల కృష్ణ ఆదివారం వెల్లడించారు. విజయవాడకు చెందిన రవితేజ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. గల్లంతైన మరో వ్యక్తిని ఫోటోగ్రాఫర్ సాదిష్‌గా గుర్తించారు. అతని కోసం ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.