పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అక్రమ కట్టడాలు తొలగించాలంటూ శనివారం పాత బస్టాండ్ వద్ద వర్షంలోనూ నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ వచ్చి సోమవారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.