చింతూరు మండలంలోని ఉలుమూరుకు చెందిన పూసం రాజయ్య గురువారం వరద నీటిలో గల్లంతయ్యాడు. రాజయ్య ఉదయం తన గేదెలను మేతకు తీసుకెళ్లాడు. తిరిగి వాటిని ఇంటికి తీసుకొని వచ్చేందుకు గ్రామ శివారు వాగు (పాయ) దాటుతూ గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో స్థానికులు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా. గోదావరి వరదల కారణంగా గ్రామాలను నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే.