మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో శుక్రవారం వాతావరణంలో మార్పు ప్రభావంతో వర్షం కురిసింది. బోదులూరు, నరసాపురం పరిసర ప్రాంతాల్లో అరగంట సేపు వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. రోడ్లన్నీ తడిచి ముద్దయ్యాయి. వర్షానికి జనజీవనం కాసేపు స్తంభించింది. వై. రామవరం, అడ్డతీగల మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది.