రాజవొమ్మంగి మండలంలోని వట్టిగెడ్డ గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా జలుమూరి రమణమ్మ వారి గోశాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష విజయభాస్కర్ దంపతులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పెద్దిరాజు కేశవ పార్వతి రమణి తాతారావు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.