ఈ నెల 19నుండి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు అల్లూరి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరావు శనివారం తెలిపారు. రంపచోడవరం ఆశ్రమ పాఠశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పరీక్ష పేపర్లు తరలింపు కార్యక్రమంను ఆయన పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.