ఏజెన్సీలో పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సబ్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ అన్నారు. శనివారం ఐటీడీఏ హాలులో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పర్యటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి, చెత్త కుండీల్లో వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.