ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పై ఎమ్మెల్యే శిరీషదేవి శనివారం రంపచోడవరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకుల అరాచకాలను దుయ్యబట్టారు. ప్రజలు తమపై చూపుతున్న ఆదరణను చూసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తుందని తెలిపారు.