రంపచోడవరం: ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

1చూసినవారు
రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవిపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఫైర్ అయ్యారు. ఈ మేరకు అడ్డతీగలలో శనివారం ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది పాలనలో ఎమ్మెల్యే చేసిందేమీ లేదని అవినీతిలో రికార్డు సృష్టించారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో సమస్యలు పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో ఉంటామని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు మానుకొని రాజకీయ పరంగా ఎదుర్కోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్